బరువు తగ్గడానికి పాటించవలసిన ఐదు నియమాలు ఇవే

బరువు తగ్గాలంటే

డైట్ ప్లాన్ లో ఆరోగ్యకర ఆహారాలు మాత్రమే ఉండాలి. సరైన డైట్ ప్లాన్ ఉంటే రోజూ ఎన్ని కేలరీలు తీసుకుంటున్నాము, ఎంత సమయం వ్యాయమానికి కేటాయిస్తున్నాము అనే విషయాల పైన పూర్తి అవగాహన వస్తుంది. ఈ చక్కని ఆహార ప్రణాళిక ఊబకాయం వల్ల వచ్చే అన్ని రకాల దుష్ప్రభావాలని తగ్గిస్తూ మిమ్మల్ని ఆరోగ్యకరంగా బరువు తగ్గేలా చేస్తుంది! బరువు తగ్గేందుకు వ్యాయామాలు చేయాలి.. ఆహారంలో మార్పులను పాటించాలనే విషయం అందరికీ తెలిసిందే. మరి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి అనే విషయంపై చాలా మందికి క్లారిటీ ఉండదు. చాలామంది డైటింగ్ తో మరిన్ని సమస్యలను తెచ్చుకుంటారు. అలా చేయడం వల్ల మీ హెల్త్ పూర్తిగా దెబ్బతింటుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూనే మీరు ఈజీగా బరువు తగ్గొచ్చు. అందుకు సింపుల్ గా ఐదు టిప్స్ పాటిస్తే చాలు.

బ్రేక్ ఫాస్ట్ : చాలామంది బ్రేక్ ఫాస్ట్ సరిగ్గా తినరు. దీంతో బరువు తగ్గకపోగా సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడే అవకాశం ఉంది. అందువల్ల మంచి పౌష్టికాహారం గల బ్రేక్ ఫాస్ట్ తప్పని సరిగా తీసుకోవాలి. ఓట్స్ తో కూడిన బ్రేక్ ఫాస్ట్ చేస్తే చాలా ప్రయోజనాలున్నాయి. వాటిలోని కార్బోహైడ్రేట్స్ మీ ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. వీలైనంత వరకు విత్తనాలతో తయారు చేసే బ్రేక్ ఫాస్ట్ తినడానికి ప్రయత్నించండి. దీని ద్వారా మీ బాడీకి మంచి ప్రోటీన్స్ అందుతాయి. ఓట్స్ ద్వారా మీ బ్లడ్ సుగర్ అదుపులో ఉంటుంది. అలాగే మీ శరీరంలో ఇన్స్ లిన్ లెవెల్స్ స్థిరంగా ఉంటాయి. ఫ్యాట్ పెరగకుండా ఉంటుంది.

ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఆహారం : ఫైబర్ అధికంగా ఉంటే ఆహారంలో మంచి ప్రోటీన్స్ ఉంటాయి. ఈ రకమైన ఆహారం దీర్ఘకాలంగా మీ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. మీరు తినే ఆహారంలో ఎక్కువగా ప్రోటీన్స్ ఉండేలా చూసుకోండి. ఉదాహరణకు గుడ్డు, మాంసం లాంటివి తీసుకోవాలి.

విత్తనాలతో కూడిన ఆహారం : ఇలాంటి ఆహారం వల్ల మీ శరీరానికి కార్బోహ్రైడేట్స్ ఎక్కువ అందుతాయి. వెంటనే జీర్ణం కావాడానికి అవకాశం ఉంటుంది. జొన్నలు, సజ్జలు, రాగి ఇలాంటి ధాన్యంతో తయారు చేసే ఫుడ్ తీసుకోవడం చాలా మంచింది. ఈ ఆహారం వల్ల మీ బ్లడ్ సుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి.

మీరు చాలా పీచు పదార్థాలు, ఆకుకూరలు, మరియు ఆకుపచ్చని కూరగాయలు తినాలి. పీచు పదార్థాల వల్ల జీర్ణ శక్తి అధికంగా ఉంటుంది.

పంచదారకు బదులు తేనె: ఒక కప్పు టీ లేదా ఒక బౌల్ సలాడ్స్ లో పంచదారకు బదులుగా తేనె జోడించుకోవాలి. ఈ హెల్తీ ఫుడ్ వల్ల చాలా తక్కువ క్యాలరీ శరీరానికి అందడం వల్ల బరువును తగ్గించుకోవచ్చు . హార్ట్ కూడా చాలా మంచిది.

ఓట్స్: అందరూ వేలం వెర్రిగా కొంటున్న ఓట్స్ వల్ల ఆరోగ్యానికి ఎంత మేలో అంతే ఇబ్బందీ కూడా కలుగజేస్తాయి. ఇది శరీరంలోని కొలెస్ర్టాల్ ను తగ్గిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేనప్పటికీ గ్యాస్ సమస్యలకు మాత్రం కారణమవుతోంది. ఓట్స్ లో ఉండే సోలబుల్ ఫైబర్ పేగుల్లో ఎక్కువ గ్యాస్ ఉత్పత్తికి కారణమవుతుంది. సరైన పద్ధతిలో ఓట్స్ తీసుకోవడం వల్ల తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు

Leave a comment